ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోలు చేయాలి..


Ens Balu
8
Bhimanapalli
2022-12-07 07:45:16

రైతాంగం ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని ఆర్పీకెల ద్వారా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకొని అధిక ధరలు పొందాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా పేర్కొన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని భీమనపల్లి,  విలసవిల్లి గ్రామాలలో వ్యవసాయ, పౌర సరపరాలు, రెవెన్యూ ,తూనికలు కొలతలు అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. తొలుత భీమనపల్లి రైతు భరోసా కేంద్రంలో రైతులు అధికారులతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏ విధంగా ధాన్యం సేకరణ ప్రక్రియ చేపట్టిందన్న వివరాలను అధికారులు రైతుల ద్వారా ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఆర్బికేలు ఆశ్రయించి ధాన్యం నమూనాలను అందించి వారి సూచనలకు అనుగుణంగా దాన్యం ఆరబెట్టుకుని మంచి గిట్టుబాటు ధరలు పొందాలని రైతులకు పిలుపునిచ్చారు. హమాలీ చార్జీలు ,రవాణా చార్జీలు చెల్లింపులు గూర్చి అధికారులు ఆరా తియ్యగా. హామాల్లి రవాణా చార్జీలు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

విశాఖపట్నం వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా రైతులు అప్రమత్తమై అమ్మకానికి సిద్ధపరిచిన తమ కళ్ళాలలోని ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లు అధికారులు రైతులు సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ కొనుగోలు ప్రక్రియలు యధావిధిగా కొనసాగించాలని అధికారులకు సూచించారు మండలంలో ఎంత మేర విస్తీర్ణంలో వరి సాగు చేపట్టింది అడిగి తెలుసుకున్నారు ఇంతవరకు హార్వెస్టింగ్ ఎంత మేర విస్తీర్ణంలో జరిగింది అధికారులను అడగగా సుమారు రెండువేల ఎకరాలు పంట విస్తీర్ణం ఉందని ఇప్పటివరకు వేయి ఎకరాలలో హర్వెస్టింగ్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్త కుండా అన్ని రకాల చర్యలు పటిష్టంగావించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విల్లసవిల్లి గ్రామంలో రైతాంగం కళ్ళాలో ఆరబెట్టిన ధాన్యరాశులను ఆయన క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి వాతావరణ హెచ్చరికలు మూలంగా ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కాకి నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కె తులసి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఏ పాపారావు,డిపిఓ వి కృష్ణకుమారి తూనికలు కొలకలు శాఖల అధికారి వెంకటేశ్వర్రావు, తాసిల్దార్ ఏ వెంకటేశ్వరి క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు