ఇళ్ల నిర్మాణానికి సామగ్రి లబ్దిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. కొమరాడలో నిర్మిస్తున్న జగనన్న ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బుధ వారం పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సిమెంట్, ఇసుక, ఐరన్ తదితర మెటీరియల్స్ అందజేస్తున్నారని, బ్యాంకులతో మాట్లాడి రుణం ఇప్పించారని, కరెంట్ సమస్య కొంత ఉందని దాని వలన నీటిని దూర ప్రాంతాల నుడి తీసుకొని రావలసి వస్తుందని, నిర్మాణ పనులలో కొంచెం జాప్యం జరుగుతోందని లబ్దిదారులు వివరించారు. మహిళా సంఘాలకు బ్యాంకులు సకాలంలో రుణాలు అందజేయాలని, బాధ్యత మీదే అని అధికారులను ఆదేశించారు. ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని, ప్రతి ఒక్కలబ్ది దారుడు గ్రౌండింగ్ చేసి డిసెంబర్ నెలాఖరుకు నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని అధికారులకు, లబ్ధిదారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. రఘురాం, గృహ నిర్మాణ, మండల అధికారులు పాల్గొన్నారు.