పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన కాకినాడ ఒకటవ సర్కిల్ పరిధిలోని రమణయ్యపేట ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. తడి-పొడి చెత్త విభజించి ఇస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అపార్ట్మెంట్ల వద్ద చెత్త సేకరణ లో ఇబ్బందులను గమనించారు. బహుళ అంతస్తుల భవనాల యజమానులు పెద్ద డస్ట్ బిన్ లను సెల్లార్లలో ఏర్పాటు చేసుకొని సిబ్బందికి సహకరించాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు పక్కన చెత్త వేయడానికి గుర్తించారు. ఆ ప్రాంతాలపై పారిశుధ్య సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏ డి సి నాగ నరసింహారావు కోరారు., రోడ్ స్వీపింగ్ తో పాటు పుష్ క్యాట్ ద్వారా చిన్న చిన్న సందుల్లోని చెత్తను శుభ్రం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో విఫలమైతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట అక్కడి శానిటరీ ఇన్స్పెక్టర్ తో పాటు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.