ప్రభుత్వ అనుమతులు లేవు.. బొలిశెట్టి అనుమతి వుంది..


Ens Balu
4
s.rayavaram
2020-09-23 12:40:43

అంతా నాఇష్టం పంటకాలువలు.. ఆర్అండ్ బీ రోడ్డూ.. ఎక్కడైనా నేను నా ఆస్తులకు బ్రిడ్జిలు నిర్మిస్తాను.. అడిగేవారెవరు?  నీటిపారుదలశాఖ ఏఇ వచ్చి ఇరిగేషన్ కాలువపై నిర్మిస్తున్న బ్రడ్జీలు, నేను చెప్పిన సమాధానం విని ఏమీ అనకుండా వెళ్లిపోయాడు.. ప్రభుత్వ అనుమతులు లేవు.. పంచాయతీ అనుమతులు అసలే లేవు.. కానీ వైఎస్సార్సీపీ పెద్దనాయకుడు బొలిశెట్టి గొవిందరావు అనుమతి వుంది.. పైగా నేను ఆయన అనుచరుడిని చాలా ఇంకేమైనా కావాలా.. అంటూ కర్రి ధనరెడ్డి అనే వ్యక్తి ఎస్.రాయవరంలో తనకు నచ్చినట్టుగా పంటకాలువపై ఇష్టమొచ్చినట్టు నాలుగు వంతెనలు నిర్మించాడు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొల్లబాబూరావు, తరువాత అత్యధిక ఫాలోయింగ్ వున్న వ్యక్తి బొలిశెట్టి గోవిందరావు, ఈయనను ప్రసన్నం చేసుకుంటే చాలు నియోజకవర్గంలోని అందరు అధికారులు చెప్పినట్టు వింటారు. అదే ఫాలోయింగ్ ను కొందరు అక్రమార్కులు కూడా తమకి నచ్చినట్టుగా వినియోగించుకుంటన్నారు. ఎస్.రాయవరంలో ఎంపీడిఓ కార్యాలయం ముందున్న శ్రీ వెంకటేశ్వర  కళ్యాణమండపానికి సదరు ఓనరు కర్రిధనరెడ్డి మండపాని రెండువైపులా ఇరిగేషన్ కాలువపై బ్రిడ్జిలు నిర్మించేశారు. ఇపుడు మూడవది ముందువైపు నిర్మస్తున్నారు. అంతేకాదు తన ఇంటి ముందు పంటకాలువపై మరొక వంతెన కూడా నిర్మించేస్తున్నాడు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే. ఇరిగేషన్ పంట కాలువలపై ఎలాంటి ఆక్రమణలు, కట్టడాలు ప్రభుత్వం తప్పా మరెవరూ నిర్మించడానికి వీలులేదు. అయినా తన వెనకున్న నాయకుడిని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా పంటకాలువలను ఆక్రమించారని ఎస్.రాయవరానికి చెందిన సమాచారహక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డిరాజు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఇరిగేషన్ ఏఇ ఈ నిర్మాణాల అక్రమమని హెచ్చరించినా, బొలిశెట్టి ద్వారా ఎమ్మెల్యే తో మాట్లాడిస్తానని, కావాలంటే మీరు వారికి సమాధానం చెప్పుకోవాలని కర్రధనరెడ్డి ప్రభుత్వ ఏఇని వారించి పంపేశారు. ఆరోజుకిని నిర్మాణం ఆపినా, మరుసటి రోజు నుంచి నిరాటంకంగా నిర్మాణాలు చేస్తూనే ఉన్నారు. 5వ వంతెన రాయవరం నుంచి సర్వశిద్ధి పోవు తారురోడ్డుని ఆనుకొని వున్న గెస్టు హౌస్ కి ఒక బ్రిడ్జి పంటకాలువపై కట్టాడు. వీటన్నింటినీ సోమిరెడ్డి రాజు ఫోటో ఆధారాలు లిఖిత పూర్వ ఫిర్యాదులతో ఇరిగేషన్ శాఖకు, ఆర్అండ్బి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా ఎవరైనా స్థానికులు అక్రమనిర్మాణాలపై మాట్లాడేందుకు ముందుకు వస్తే...వారి అవసరాలకు అప్పులు ఇచ్చి వారిని నియంత్రిస్తాడని కూడా రాజు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్.రాయవరం మండలంలోని అక్రమాలు, అవినీతిపై గత కొన్ని సంవత్సరాలుగా సోమిరెడ్డిరాజు సమాచార హక్కుచట్టం ద్వారా జరిగిని అవినీతిని వెలికితీస్తున్నారు. ఈ విషయం బొలిశెట్టికతి తెలియడంతో, ఎమ్మెల్యే ఏమీ అనకుండా తాను చూసుకుంటానని, నీ పనిఎక్కడా ఆపొద్దంటూ హామీ ఇవ్వడంతోనే కర్రిధనరెడ్డి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పంటకాలువపై, ఇరిగేషన్ ఆస్తులపై సొంత నిర్మాణాలు చేపడుతున్నారని సోమిరెడ్డి మీడియాకి వివరించారు. తక్షణమే ఈ అక్రమ నిర్మాణాలు తొలగించకపోతే, విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్రుష్టికీ తీసుకెళతామని సోమిరెడ్డిరాజు, స్థానిక గ్రామస్థాయి నాయకులు మీడియాకి వివరించారు.  ఇరిగేషన్ భూములు, పంటకాలువలపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే సుప్రీంకోర్టుఆదేశాలున్నా...కొందరు అక్రమార్కులు అధికారపార్టీ ఎమ్మెల్యేలకు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరించడం విశాఖజిల్లాలో చర్చనీయాంశం అవుతుంది..