అంగన్వాడీ కేంద్రాల ద్వారా పేద పిల్లలు బాలింతలు గర్భిణీలకు పౌష్టికాహారం అందజేయడమే లక్ష్యమని జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి చెప్పారు. శుక్రవారం ఆమె కె.కోటపాడు మండల కేంద్రం లోని సెంటర్ 5, గొండుపాలెం అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రంలోని వంటగది, వంట చేసిన ఆహార పదార్థాలను పరిశీలించారు. పదార్థాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని, నిర్ణయించిన మెనూ ప్రకారం ఆహారం వండాలని ఆదేశించారు. ఏమాత్రం లోటుపాట్లు వచ్చిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకు ముందు కేంద్రంలోని చిన్నారులతో ముచ్చటించారు.