అనకాపల్లిలో దాడి జయవీర్ భూఆక్రమణలు అడ్డుకోండి


Ens Balu
62
Anakapalle
2022-12-12 13:36:21

అనకాపల్లి జిల్లాలో అధికారపార్టీకి చెందిన నేత దాడి జయవీర్ భూ ఆక్రమణలు ప్రభుత్వం తక్షణమే అడ్డుకోవాలని జై అనకాపల్లి సేన అధ్యక్షులు కొనతాల సీతారామ్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంగా అనకాపల్లి మారిన తరువాత ఎక్కడ విలువైన భూములు ఉండే అక్కడ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్వయంగా తాను అనకాపల్లిలో శంకర్ థియేటర్ వెనుక, హిమశేఖర్ స్కూలు ముందు దక్షిణంలోని సర్వే నెంబరు 50/13 లో కొనుగోలు చేసి  2018లో రిజిస్టర్ చేయించుకున్న భూమి 3920 గజాల భూమిని ఇపుడు అధికారపార్టీనేతలు కబ్జా చేశారన్నారు. దీనిపై తాను ముఖ్యమంత్రి కార్యాలయాలనికి  ఫిర్యాదు చేసినట్టు మీడియాకి విడుదల చేసిన ప్రకటన పేర్కొన్నారు. కర్రి బ్రహ్మానందం అనే వ్యక్తి దగ్గర నుంచి తనబావమరిది రామచంద్రరావు కొనుగోలు చేశారని.ఆయన దగ్గర నుంచి తాముకొనుగోలు చేసుకున్నామని..నేటికీ మా పేర్లుతోనే రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఆన్ లైన్ లో విరాలు చూపిస్తున్నాయని మీడియాకి విడుదలచేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇపుడు ఎవరివ వద్దనైతే తాము ఈ భూములు కొనుగోలు చేశామో అదే వ్యక్తిని అధికారపార్టీనేతలు ప్రలోభాలకు గురిచేసి.. రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులు తారుమారు చేస్తున్నారన్నారు. 

తమ భూముల్లోని బోర్డులను పీకేసి..ఆక్రమించుకున్నవారి బోర్డులు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం తప్పుడు పనులకు, భూ కబ్జాలకు పాల్పడే వారు ఎలాంటి వారైనా కఠిన చర్యలు చర్యలు తీసుకుంటుందనే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటనపై నమ్మకంతోనే ఇపుడు తాను తనభూమి అన్యాక్రాంతం అయిన విషయాన్ని ఫిర్యాదు చేశానన్నారు. త్వరలోనే తన భూమి వివరాలు, రికార్డులు ఎవరెవరు తప్పుడు డాక్యుమెంట్లుతో తారుమారు చేశారో వారి వివరాలతో ముఖ్యమంత్రిని కలవనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఇదే విషయమై జిల్లా రిజిస్ట్రార్, మరియు కలెక్టర్ కి ఫిర్యాదు చేసినట్టు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలోతెలియజేశారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాట సాగిస్తానని తెలియజేశారు. అనకాపల్లి జిల్లాలో ఎరికైనా విలువైన భూములుంటే తక్షనమే నిర్మాణాలు చేసుకోవాలని లేదంటే..అధికారపార్టీ నేతల కంట్లో పడితే రాత్రికి రాత్రే ఆ భముల రికార్డులు మారిపోయే ప్రమాదం వుందని కొణతాల సీతారామం హెచ్చరించారు. ప్రభుత్వం అధికారపార్టీనేత భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోకపోతే న్యాయపరంగా పోరాటం చేసేందుకు వెనుకాడేది లేదన్నారు.

సిఫార్సు