ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది..


Ens Balu
16
Kolluru
2022-12-12 14:24:42

సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.
  కొల్లూరు మండలం రావికంపాడు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాగార్జున, జిల్లా కలెక్టర్  విజయ కృష్ణన్ కలిసి సోమవారం పాల్గొన్నారు. ముందుగా రూ.40 లక్షలతో గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. కుంభమేళాతో రాష్ట్రమంత్రి,  కలెక్టర్ కి  గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.
 గ్రామ ప్రజల ఇంటి ముంగిటకే పరిపాలన వ్యవస్థను ప్రభుత్వం తెచ్చిందని మంత్రి నాగార్జున చెప్పారు. సచివాలయాల వ్యవస్థతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చక్కగా ప్రజలకు చేరవేయడంలో సచివాలయాల సిబ్బంది, వాలంటీర్ల పాత్ర అభినందనీయమన్నారు. నిరుపేదలైన ప్రతి ఇంటికి నవరత్నాలతో సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి తెలిపారు.

 ప్రజలకు అన్ని సేవలు సచివాలయాలనుంచి అందించేలా అధికారులు సహకరించాలని ఆయన కోరారు.
   అనంతరం ఉపకార వేతనం కింద రూ.55,000లు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద రూ.14,050లు లబ్ధి పొందిన పల్లకట్టి హేమంత్ కుటుంబాన్ని మంత్రి, కలెక్టర్ సందర్శించారు. నవరత్నాలు బ్రోచర్ ను లబ్ధిదారుడికి అందజేశారు. పంటల బీమా రూ.25,980, సున్నా వడ్డీ, వైయస్సార్ పింఛన్ కానుక నగదు అందుకున్న మరో లబ్ధిదారులు లంక నాగేంద్రం కుటుంబాన్ని పరామర్శించి పత్రాన్ని అందించారు.
   కార్యక్రమంలో రేపల్లె ఆర్డిఓ పార్థసారథి, తాసిల్దార్, ఎంపిడిఓ, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు