పశ్చిమ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుచున్నదని,రైతులకు మరింత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి సంబధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామంలో రైతు బరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టరు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజులు లోపుగానే నగదు జమ జరుగుతుందన్నారు. ధాన్యం రవాణాను ప్రభుత్వం చేపడితే ఏజెన్సీకి రవాణా ఖర్చులు చెల్లించడం జరుగుతుందని, అలాగే రైతు గాని స్వయంగా రవాణా, గన్ని బ్యాగులు, హమాలీలను ఏర్పాటు చేసుకుంటే దాన్యం డబ్బుతో పాటు సదరు ఖర్చులను కూడా రైతు ఖాతాలో నేరుగా జమ చేస్తామన్నారు.
గన్ని బ్యాగులకు ఇబ్బంది లేదని ఇప్పటికే గన్నిబాగ్ లు జిల్లాలో అన్ని ఆర్ బి కె కేంద్రాలలో సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. ఏక్కడయినా ఏటువంటి సమస్య తలెత్తినా వెను వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని , నిర్లక్ష్యం అలసత్వం వహించినా , పిర్యాదు లు వచ్చినా సంబంధిత అధికారులు, సిబ్బందిని కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు అన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రంలో ఎంతమంది రైతుల దగ్గర నుండి దాన్యాన్ని కొనుగోలు చేశారు. ఎంత మొత్తం ధాన్యం కొనుగోలు చేశారు, ఎంతమంది రైతులకు ఎన్ని డబ్బులు చెల్లించారు, ఇంకా ఎంతమంది రైతులకు డబ్బులు చెల్లించవలసి ఉంది తదితర వివరాలను కంప్యూటర్ లో , రిజిస్టర్లు జిల్లా కలెక్టరు పరిశీలించారు.
అనంతరం లంకలకోడేరులోని వెంకటసాయి ట్రేడర్సు రైస్ మిల్లును జిల్లా కలెక్టరు తనిఖీచేశారు. ఈ రైస్ మిల్లు కు ఎప్పటి వరకు ఎంత ధాన్యం తరలించడం జరిగిందని , ఇంకా ఎంత ధాన్యాన్ని మిల్లుకు సరఫరా చేయాలి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో ధాన్యం నిల్వల రికార్డులను పరిశీలించారు. ధాన్యం నిల్వలలో వ్యత్యాసాలు ఉంటే సంబంధిత యాజమాన్యపై చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి హెచ్చరించారు.
ఈ తనిఖీలో జిల్లా సివిల్ సప్లై అధికారి యన్.సరోజ , ఏ యస్ వో యం.రవి శంకర్, వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ రహీమ్, రైతు భరోసా కేంద్రం సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.