నా అనేవారు లేని యాచకులను ఆదుకోవడానికి మనసున్న దాతలు ముందుకి రావాలని సామాజిక కార్యకర్త బాలభానుమూర్తి అన్నారు. గురువారం సింహాచలంల ప్రాంతంలోని యాచకులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాధులకు, నిరాశ్రయులకు, యాచకులకు దుస్తులు పంపిణీ చేసే నిరంతర సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం గోపాలపట్నం నుంచి సింహాచలం వరకు బిక్షాటన చేసే యచకులకు నేడు నూతన చీరలు, రెడీ మేడ్ జాకెట్టులు, పంచెలు పంపిణీ చేశామన్నారు. దాతలు సహాయంతో వారికి కాస్త స్వాంతన లభిస్తుందన్నారు.