నిర్ణీత గడువులోపు ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయాలి


Ens Balu
13
Amadalavalasa
2022-12-15 11:22:44

నిర్ణీత గడువులోపు ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయాలని దానికి అధికారి యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీ సంబంధించి గాజుల కొల్లువలస లో సుమారు 1734 ఇళ్ల పట్టాలు మంజూరు చేసామన్నారు. ఈ లేఔట్ ని గురువారం స్పీకర్ తమ్మినేని అధికారులతో వెళ్లి పరిశీలించారు. ఇల్లు నిర్మాణంలో స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ఇప్పుడు నిర్మిస్తున్నది జగనన్న కాలనీలు కాదని క్రొత్తగా ఉల్లనే ఈ ప్రభుత్వం నిర్మిస్తుందని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం 1.70 లక్షల మంది లబ్ధిదారులకు 840 కోట్లు బిల్లులు చెల్లించిందన్నారు అందులో సిమెంటు ఐరన్ మొదలగు నిర్మాణ సామాగ్రికి 132 కోట్లు చెల్లించిందన్నారు ఇంతవరకు ఈ ఆర్థిక సంవత్సరానికి 6495 కోట్లు ఖర్చు చేశామన్నారు.

 రాష్ట్రంలో 31 లక్ష పట్టాలిచ్చామని అందులో 15 లక్షల ఇల్లు నిర్మాణం శంకుస్థాపన పూర్తిచేసుకుని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఈ గృహాలన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ గణపతి, మెప్మా పీడీ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం రవి సుధాకర్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల శ్యామలరావు, పిఎసిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, మొండేటి కూర్మారావు, గురుగుబిల్లి ప్రభాకర్ రావు, కూన రామకృష్ణ, సాధు చిరంజీవి, చిన్నారావు, మెట్ట జోగారావు, బొడ్డేపల్లి రమణమూర్తి తదితర వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు
సిఫార్సు