జంగాలపల్లి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ


Ens Balu
26
Makavarapalem
2022-12-26 12:08:54

బైజ్యుస్ యాప్ తో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు  ప్రభుత్వం ట్యాబ్ లను మంజూరు చేసిందని పాఠశాల హెచ్.ఎం.గంగరాజు అన్నారు. మాకవరపాలెం మండలంలోని జంగాలపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల 8.వ.తరగతి  చదువుతున్న 16 మంది విద్యార్థులకు ట్యాబ్ లను సోమవారం హెచ్.ఎం.గంగరాజు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బైజ్యుస్ యాప్ తో విద్యార్థులకు పాట్యాంశాలను మరింత వివరంగా చేప్పేందుగుకు అవకాశం ఉంటుందన్నారు.అదేవిధంగా బై జ్యుస్ మెటీరియల్ విద్యార్థులకు ఉన్నత చదువులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సిఫార్సు