నిధుల మళ్లింపుపై విచారణ ప్రారంభం..
Ens Balu
2
s.rayavaram
2020-09-23 18:34:40
ఎస్.రాయవరం మండలంలోని పంచాయితీల నిధులు మళ్ళీంపు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు డిఎల్ఫీవో శిరీషారాణి తెలిపారు. బుధవా రం మండల కేంద్రమైన రాయవరం పంచాయితీ కార్యాలయంలో మండల ఈవోపీఆర్డీ త్రిమూర్తులపై వచ్చిన ఫిర్యాదుపై ఐదు పంచాయితీల రికార్డులను పరిశీలిం చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ , గొలుగొండ మండలం ఏ.ఎల్.పురం గ్రామానికి చెందిన ఎస్.వెంకటరమణ అను వ్యక్తి రాయవరం ఈవోపీఆర్డీగా పని చేస్తున్న త్రిమూర్తులు ప్రత్యేకాధికారిగా వున్న ఐదు గ్రామాలకు చెందిన నిధులను తన కుమారుడు బ్యాంకు అకౌంట్ కు తరలించినట్లు ఫిర్యాదు చేశాడన్నారు. ఆ ఫిర్యాదుపై ఆయన ప్రత్యేకాధికారిగా వున్న కొరుప్రోలు, పెదవుప్పలం, గెడ్డపాలెం, కొత్త రేవుపోలవరం, గుడివాడ గ్రామపంచాయితీలలో అభివృద్ధి పనులకై ఖర్చు చేసిన వివరాల పరిశీలన చేస్తున్నామన్నారు . కొరుప్రోలు పంచాయితీ నుండే సుమారు యాభైవేల రూపాయలు నిధులు మళ్ళింపు జరిగాయని ఫిర్యాదులో పేర్కొనగా , సుమారు పది లక్షల రూపాయలు వరకు ఐదు పంచాయితీల నుండి నిధులు మళ్ళింపు జరిగి వుంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు . రికార్డుల పరిశీలన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని డిఎల్పీఓ శిరీషారాణి వెల్లడించారు.