కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్ధానంలోని శ్రీ సత్యదేవ నిత్యాన్నధాన ట్రస్టుకి వల్లూరు గ్రామానికి చెందిన వెంకటరమణ పద్మజ దంపతులు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని మంగళవారం ఈఓ కార్యాలయంలోని సిబ్బందికి అందజేశారు. అనంతరం దాతలు స్వామివారి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం తరపున దాతలకు తీర్ధప్రసాదాలను అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు.