పరవాడ మండలం ఫార్మాసిటీలో లారస్ యూనిట్-3 లో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలని చనిపోయిన కార్మిక కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం లంకెలపాలెం జంక్షన్ లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాలు భద్రతా ప్రమాణాలపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం జిల్లాలోని అన్ని కర్మాగారాల్లో సేఫ్టీ ఆడిట్ జరిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటస్వామి కనకారావు రమణ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.