విద్యార్థినిలకు ఉచితంగా కుట్టు పనిలో శిక్షణ.


Ens Balu
7
Kakinada
2022-12-27 06:32:05

విద్యార్థి దశలోనే కుట్టు శిక్షణ పొందడం వలన భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని పీఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శాంతి రాజేశ్వరి అన్నారు. మంగళవారం కాకినాడలోని పిఆర్ కళాశాల విద్యార్థి నులకు లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. కుట్టుపనితో ఉపాది మెరుగు పరుచుకోవచ్చునన్నారు. క్లబ్ అధ్యక్షురాలు టిసి దేవకీదేవి మాట్లాడుతూ, 60 మంది  విద్యార్థినులకు నెలరోజులపాటు శిక్షణ కేంద్రాన్ని నిర్వహించి అనంతరం వారికి సర్టిఫికెట్లను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఉష ,పద్మ,  జోన్ చైర్మన్ రమా సుందరి, క్లబ్ సభ్యులు నాగిరెడ్డి లక్ష్మి, సౌమ్య, నల్లమిల్లి శ్రీదేవి రెడ్డి, శ్రీ వాణి తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు