భారత దేశంలోనే అత్యంత పొడవైన గయాజీ రబ్బర్ డ్యామ్ ను భీహార్ లోని ఫాల్గు నదిపై నిర్మించారు. దీనిని భీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. కాగాసెప్టెంబరు 22న 2020న రబ్బర్ డ్యామ్ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేసి 2022 సెప్టెంబరు నాటికి పూర్తి చేశారు. ఈ డ్యామ్ నిర్మాణం కోసం రూ.324 కోట్ల ఖర్చుచేశారు. దీనిని ఐఐటీ రూర్కీ నిపుణులు రూపొందించారు. ఈ రబ్బర్ డ్యామ్ పొడవు 411 మీటర్లు, వెడల్పు 95.5 మీటర్ల.. మూడు మీటర్ల ఎత్తుతో వుంటుంది. ఈ రబ్బర్ డ్యామ్ నిర్మాణంతో సితాకుండ్ ప్రాంతానికి భక్తులు అధిక సంఖ్యలో వెళ్లడానికి మార్గం సుగమం అయ్యింది. ఈ రబ్బర్ డ్యామ్ దేశంలో అతిపెద్ద డ్యామ్ గా పేరుపొందింది. (BEST COACHING FOR SI & CONSTABLE : KEERTHI COMPETITIVE INSTITUTE : KAKINADA -9032228708)