ఎమ్మెల్యే పర్వతకు వైకుంఠ ఏకాదశి ఆహ్వానం


Ens Balu
17
Annavaram
2022-12-29 16:26:22

అన్నవరంలోని శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామి దేవస్థానంలో జనవరి 2వ తేదిన నిర్వహించే వైకంఠ ఏకాదశికి రావాలంటూ దేవస్థాన ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి, దేవస్థాన చైర్మన్ ఐవీ రోహిత్ లు ఆహ్వాన పత్రికను అందజేశారు. గురువారం శంఖవరంలోని ఎమ్మెల్యే, ట్రస్టుబోర్డు ప్రత్యేక ఆహ్వానితులను ఆహ్వానించారు. వైకుంఠ ఏదాశి రోజు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహిస్తున్న ట్టు ఈఓ ఎమ్మెల్యేకి వివరించారు. ఏకాదశి పర్వదినానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసినట్టు ఎమ్మెల్యేకి వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు