శంఖవరం మండలంలో కొత్తగా మంజూరైన 236 పించన్లను ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్రప్రసాద్ పంపిణీ చేశారు. మండల కేంద్రంలో ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లబ్దిదారులకు కొత్త పించన్లును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వతరాజబాబు, ఎంపీడీఓ జె.రాంబాబు, గ్రామ సచివాలయాల కార్యదర్శిలు రామచం ద్రమూర్తి, శంకరాచార్యులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, జూనియర్ సహాయకులు రమణమూర్తి, ఇతర పంచాయతీ సిబ్బంది, వైఎస్సా్ర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.