విద్యార్థుల కు మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంపిపి.రుత్తల సత్యనారాయణ అన్నారు. ఏ.పి.టి.ఎఫ్.రూపొందించిన నూతన సంవత్సార క్యాలెండర్ ను ఆయన ఆదివారం మాకవరపాలెంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత నిచ్చి పాఠశాలల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయిస్తుందని ,దానికనుగుణంగా ఉపాధ్యాయులు శ్రమించాలన్నారు. ఇప్పటికే నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలలో ను మౌలిక వసతులైన తరగతి గదులు,తాగునీరు,క్రీడల కోసం ప్రత్యేక ఆట స్థలాలను కేటాయించి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్, రాష్ట్ర,జిల్లా నేతలు వరహాలదొర,సత్యరావు, చక్రవర్తి, రాజు,అదినారాయణ,శేషగిరిరావు, తదితరులు పాల్గొన్నారు.