రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సూచించారు. ఆది వారం భీమవరం పురపాలక సంఘం పరిధి రైతు బజారు సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహం, వెనుకబడిన తరగతుల బాలిక వసతి గృహంలో నూత న సంవత్సర వేడుకలను విద్యార్థినిలతో కలసి జిల్లా కలెక్టరు జరుపుకున్నారు. కేకును కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. పుస్తకాలు, పెన్నులను , స్వీట్స్ ను విద్యార్థినిలకు అందజే శారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ గతంలో చదువుకోవాలంటే ఎన్నో ఇబ్బం దులు ఉండేవని, ఇప్పుడు చదువుకోటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని.. అవకాశాలను అందుపుచ్చుకొని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. అనంతరం వసతి గృహాల్లో ఆహారం మంచినీరు శానిటేషన్ , వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు ఏలా ఉన్నాయని విద్యార్థులను స్వయంగా జిల్లా కలెక్టరు ప్రశాంతి అడిగి తెలుసుకు న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి కె.శోభా రాణి , హెచ్ డబ్లు వో లు సి హెచ్ భానుమణి,కుసుమ ,వసతి గృహాల సిబ్బంది పాల్గొన్నారు.