అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నక్కపల్లి ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రంగనాదుడిగా వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తున్నారు. ఏడాదికి ఒకసారి మాత్రమే శేష పాన్పుపై స్వామివారి పవలిస్తున్నట్లుగా ఆయన పాదాల చెంతనే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఉన్నట్లుగా ఇక్కడ అలంకరణ చేస్తారు. సోమవారం ఉదయం నుంచి ఆలయంలో స్వామివారు రంగనాథుడిగా దర్శనమిస్తున్నారు. అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుంటున్నారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం అన్ని ఏర్పాట్లూ చేసింది.