నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సోమవారం పర్యటించారు. అనంతరం ఉప్మాక వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి వచ్చిన ఆయనకు జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉప్మాక ఆలయాన్ని దర్శించుకున్న ఆయన ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉందని అభిప్రాయపడ్డారు. అర్చకులు ఆయనకు శేష వస్త్రం స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. ఇందులో పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.