కంటెంట్ ట్యాబ్ లతో విద్యార్ధులకు ఎంతోమేలు


Ens Balu
8
Sankhavaram
2023-01-02 13:21:52

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బైజూస్ కంటెంట్ తో ఇచ్చిన ట్యాబులు విద్యార్ధుల విద్యాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని ఎంపీపీ పర్వత రాజబాబు పేర్కొన్నారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని కస్తూరీబా గాంధీ విద్యాలయంలో విద్యా్ర్ధినిలకు ఎంఈఓ ఎస్వీరమణ, ఇతర వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ట్యాబులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యను కార్పోరేట్ స్థాయికి తీసుకెళ్లిందన్నారు. ప్రిన్సిపాల్ బాలామణి కుమారి, మండల ఇన్చార్జి లచ్చబాబు, ఉపసర్పంచ్ సిహెచ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు