భూ సర్వే జరిగిన గ్రామాల్లో మంగళవారం భూహక్కు పత్రాలు గ్రామ సభలు ఏర్పాటుచేసి అందించనున్నట్టు తహసిల్దార్ పీవీ.రత్నం తెలియజేశారు. మంగళవారం మాడుగుల తహశీల్దార్ కార్యాలయంలో ఆయన సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఏఏ గ్రామాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. మండలంలోని వీరవల్లి, లక్ష్మీపురం భాగవతుల అగ్రహారం, జి అగ్రహారం, జంపెన, గాదిరాయి, విజె.పురం గ్రామాల్లో సభలు నిర్వహించి భూ హక్కు పత్రాలు పంపిణీ చేస్తామని వివరించారు. ఆయా గ్రామాల్లో అనుకున్న సమయంలో రైతులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యేట ట్టు వీఆర్వోలు, వీఆర్ఏలు ఏర్పాట్లు చేయడంతోపాటుగా గ్రామ వాలంటీర్లు డివైస్లతో విధిగా సమావేశానికి హాజరయ్యేటట్టు చూడాలని ఆదేశించారు.