దిగివస్తున్న పసిడి ధరలు క్యారెట్ పై రూ.150 తగ్గుదల


Ens Balu
8
2023-01-03 02:04:34

కొత్త ఏడాదిలో బంగారం ధరలు దిగివస్తున్నాయి. మొన్నటి వరకూ పరుగులు పెట్టిన పసిడి కాస్త నెమ్మదించింది. బంగారం ధరలు కొద్ది మేర తగ్గింపు నమోదు చేసుకుంటున్నాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,040 గా ఉంది. 22 క్యారెట్ల 
తులం బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై రూ.160 మేర ధర తగ్గింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.71,300 కి చేరింది. హైదరాబాద్‌, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.55,040 గా ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రూ.74,500 పలుకుతోంది.
సిఫార్సు