విశాఖ ఉక్కు కర్మకారాన్ని విక్రయించేందుకు కేంద్రం పావులు కడుపుతోందని, కర్మాగారాన్ని కాపాడుకోవాల్సి న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ అన్నారు. ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పోరాట కమిటీ చైర్మన్లు ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ నేతృత్వంలో ని కమిటీ సభ్యులు మంగళవారం మిందిలోని మంత్రి గుడివాడ అమర్నాథ్ క్యాంపు కార్యాలయంలో కలుసుకొ ని వినతి పత్రాన్ని సమర్పించారు. ఉక్కు కర్మాగారం సాధనకు 32 మంది ప్రాణత్యాగం చేశారని, 52 మంది శాసనసభ్యులు ఏడుగురు పార్లమెంటు సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేసి పోరాటంలో పాల్గొన్నా రని ఆదినారాయణ మంత్రికి గుర్తుచేశారు. మంత్రిని కలిసిన వారిలో వై.టీ. దాసు, వై. మస్తానప్ప ఎన్.రామచం ద్రరావు, రామకృష్ణ వి.రామ్మోహన్రావు, బి.పైడిరాజు, డి.నాయుడు, మంగ వెంకట్రావు, ఎం.పరదేశి, పిట్టారె డ్డి తదితరులు పాల్గొన్నారు.