ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏజీఎం శరద్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం వడ్లపూడిలోని వేగన్ వర్క్ షాపు సందర్శించి తనిఖీ చేశారు. వర్క్‌షాప్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. బోగీలు, వ్యాగన్ వెల్డింగ్ చేపట్టే హెడ్ స్టాక్ సెక్షన్, మెషిన్స్ షాప్, రోలర్ బేరింగ్, వ్యాగన్ షాప్, స్మిత్ షాపులో సౌకర్యాల ను ఆయన సమీక్షించారు. మోడల్ రూం, వ్యాగన్ల పునరుద్ధరణ పనులను కూడా ఆయన పరిశీలించారు. ఆయన వెంట డివిజనల్ రైల్వే మేనేజర్ అనుప్ సత్పతి, ఏడీఆర్ఎం(ఆపరేషన్స్) మనోజ్ కుమార్ సాహూ, ఇతర శాఖ అధికారులు ఉన్నారు.