సింహాచలంలోని సింహగిరి పైన సింహాద్రి అప్పన్న అన్నదానం భవనంలో నూతన బాయిలర్ ను ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీను బాబు ,దినేష్ రాజు, శ్రీదేవి వర్మ , ప్రత్యేక అహ్వనితులు చందు యాదవ్ తదితరులు సంయుక్తంగా ప్రారంభించారు. నూతనం ఏర్పాటు చేసిన బాయిలర్ వలన భక్తులకు ఆహారాన్ని సత్వరమే తయారు చేయడానికి వీలుగా వుంటుందన్నారు. అదే సమయంలో ఎక్కవ మందికి వేగంగా చేయవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, అన్నదానం సూపరెం డెంట్ పాలూరు నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.