సంక్రాంతి పండుగ సందర్భంగా, ముందు, తరువాత కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం రూరల్ సిఐ పి.రమణయ్య హెచ్చరించారు. గురువారం ఆయన ఈఎన్ఎస్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. సర్కిల్ పరిధిలోని నాలుగు స్టేషన్లపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. మహిళల రక్షణపై
ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్టు సిఐ చెప్పారు. దిశయాప్ పై ప్రజలకు మరింత అవగాహన కల్పించడంతోపాటు ఇనిస్టాల్స్ సంఖ్యను మరింతగా పెంచేందుకు సచివాలయ మహిళా పోలీసుల ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా ఎప్పుడైనా స్టేషన్ ను సంప్రదించవచ్చునన్నారు.