కిరాణా, పాన్ షాపులు, దేవాలయాల నిర్వహాకులు తప్పని సరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే శంఖవరం మండల కేంద్రంలోని కిరాణా, పాన్ షాపులు, దేవాలయాలకు పోలీసుశాఖ ఆదేశ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ మహిళా పోలీస్ మాట్లాడుతూ, సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం వలన నిర్వహణ ప్రాంతాలకు రక్షణతోపాటు, గొడవులు, అల్లర్లు, దొంగతనాలు జరిగే సమాయాల్లో అవన్నీ సిసి కెమెరాల్లో చిత్రీకరించడానికి అవకాశం వుంటుందన్నారు. నిడివి వున్న స్టోరేజి బాక్స్ లు ఏర్పాటు చేసుకోవాలని, పోలీసు శాఖ సూచనలు తప్పక పాటించాలని షాపుల నిర్వాహకులకు సూచిస్తున్నారు.