చెత్త నుంచి సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసువచ్చి, వాటి ఉపయోగాలపై అవగాహన కల్పించాలని ఎంపీడీవో డి.సీతారామరాజు పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ఈవోపీఆర్డీ వెంకట నారాయణతో కలిసి నక్కపల్లి మండలంలోని బంగారమ్మపేట మత్స్యకార గ్రామంలో గురువారం సంపద కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, కేంద్రం నిరంతరం వినియోగించేలా సచివాలయ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. తడి, పొడి చెత్త సేకరణకు సంబంధించి గ్రామస్థులకు అవగాహన కల్పించాలన్నారు. గృహాలు, గ్రామాలు పరిశుభ్రంగా వుండాలన్నారు. ఎప్పటికప్పుడు వార్డుల వారీగా చెత్తను సేకరించి ఈ కేంద్రానికి తరలించాలని గ్రీన్ అంబాసిడర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.