ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం


Ens Balu
7
Kovvur
2023-01-06 09:07:10

కొవ్వూరు సామాజిక ఆరోగ్య కేంద్రం పై తరచుగా ఫిర్యాదుల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించామని జిల్లా కలెక్టర్ డా కే.మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ మాధవీలత కొవ్వూరు సి హెచ్ సి ని ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు, వైద్యానికి పెద్దపీట వేయ్యాడమే కాకుండా నిధులు, మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగు తోందన్నారు. కొవ్వూరు ఆసుపత్రి పై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. వైద్య సేవలు పరంగా, రక్త తదితర పరీక్షల నిమిత్తం వచ్చే రోగులకు సేవలు అందించడా నికి నిరాకరించినా, రాజమండ్రి ఆసుపత్రికి గానీ, ప్రవేటు ఆసుపత్రికి గానీ సిఫార్సు చేసినా, ల్యాబ్ ద్వారా చేసే రక్త, తదితర పరీక్షలు ఇక్కడ కాకుండా బయట ప్రవేట్ ల్యాబ్ లకు సిఫార్సు చేస్తే, వాటిపై ముందుకు వచ్చి ఫిర్యాదు చెయ్యాలని మాధవీలత విజ్ఞప్తి చేశారు. అప్పుడే అటువంటి వాటిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. 

ముఖ్యమంత్రి విద్యకు, వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా నాడు నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. ఇకపై ప్రతిరోజూ ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉంటారని, వారి వివరాలు ప్రజలకు తెలియచేయడం జరుగు తుందన్నారు. గైనకాలజిస్ట్, అర్థో, పీడియాట్రిస్ట్ (చిన్న పిల్లల వైద్య నిపుణులు) తదితర నిపుణులైన వైద్యుల సేవలు కొవ్వూరు ప్రజలకు ఇకపై అందుబాటులో తీసుకుని వస్తున్నట్లు తెలిపారు.

  పోస్ట్ మార్టం గదికి, ఇతర సమస్యల కు సంబంధించిన సౌకర్యాల కోసం తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. వైద్య సేవలు పొందుతున్న వారిని ఎవరినైనా బయటకు వెళ్లి పరీక్షలు, సేవలు చేసుకోవాలని  సిఫార్సు చేస్తే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని అన్నారు. ఇందుకోసం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామన్నారు.కలెక్టర్ వెంట అదనపు డి ఎం అండ్ హెచ్ వో డా. ఎన్. వసుంధర, ఆసుపత్రి పర్యవేక్షకురాలు డా కె. సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు