సాలూరులో పట్టణ గృహ నిర్మాణాలు జరగాలని పార్వతీపురం ఐటిడిఎ పీఓ, సాలూరు గృహ నిర్మాణ ప్రత్యేక అధికారి సి.విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు. సాలూరు మునిసిపాలిటీ పరిధిలో నెలిపర్తి జగనన్న గృహ నిర్మాణ కాలనీని శుక్ర వారం పీఓపరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు వేగం పుంజుకోవాలని ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు అనువుగా సామగ్రి సరఫరా చేయాలని ఆయన ఆదేశించారు. జగనన్న కాలనీలో మౌళిక సదుపాయాలు ముందుగా ఏర్పాటు చేయాలని తద్వారా నిర్మాణాలకు అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ హెచ్. శంకర రావు, గృహ నిర్మాణ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.