రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎత్తిపోతల పధకాలను మంజూరు చేసినట్టు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. శుక్రవారం అద్దంకి నియోజకవర్గ పరిధిలోని బల్లికురవ మండలం వెలమవారిపాలెంలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.8.75 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పధకాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గం మేరక ప్రాంతం మని ఈ ప్రాంతం ఎత్తిపోతల పధకాల వల్ల సస్యశ్యామల మవుతుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.