ప్రతీఒక్కరూ వారంలో ఒకరోజు డ్రైడే పాటించాలి


Ens Balu
8
Parvathipuram
2023-01-06 14:12:31

ప్రతి ఒక్కరూ డ్రై డే ను పాటించాలని ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. శుక్రవారం డ్రైడేలో భాగంగా పార్వతిపురం వసుంధర నగర్, వెంకం పేట వద్ద జిల్లా మలేరియా అధికారితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని తద్వారా దోమలను నివారించవచ్చని అన్నారు. శుక్ర వారం ఇంట్లో అన్ని పాత్రలను ఖాళీ చేసి ఎండలో పూర్తిగా అరవేయాలని తద్వారా అందులో ఉండే బ్యాక్టీరియా, లార్వా పూర్తిగా నశించిపోతుందని పేర్కొన్నారు. డ్రై డే పాటించడం తమ బాధ్యతగా భావించాలని సూచించారు. దోమల నివారణకు ఇది అత్యంత ఆవశ్యమని చెప్పారు. దోమల నుండి ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని అందుకు దోమతెరలను, దోమ నిరోధకాలను వినియోగించాలని సూచించారు. ఆరోగ్యం పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు, సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.
సిఫార్సు