తులసిరావు కుటుంబాన్ని పరామర్శించిన విజయసాయిరెడ్డి


Ens Balu
9
యలమంచిలి
2023-01-06 16:18:25

విశాఖ డైరీ చైర్మన్ తులసిరావు మృతి పట్ల రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. శుక్రవారం ఎలమంచిలి లోని తులసిరావు నివాసానికి విజయసాయిరెడ్డితో పాటు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి తులసిరావు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.  తులసిరావు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తులసిరావు కుమారుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్, కుమార్తె పిల్లా రమాకుమారిని  ఓదార్చారు. తులసిరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో విశాఖ జిల్లా వైకాపా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, ఎంఎల్సీ వంశీక్రిష్ణ యాదవ్, వరుదు కళ్యాణి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు తదితరులు ఉన్నారు.
సిఫార్సు