సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయరాదు


Ens Balu
16
Seethampeta
2023-01-07 11:18:06

సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయరాదు అని ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. యువత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం జ్ఞాన సముపార్జన కోసమే ఉపయోగించాలి, స్వీయ నిర్దేశిత క్రమశిక్షణ పాటించి కష్టపడి చదివి  మంచి ఉద్యోగాలు సంపాదించాలన్నారు. జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ న్యూఢిల్లీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్షులు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా  శనివారం సీతమ్మపేటలోని ఐటిడిఏ కార్యాలయంలో న్యాయ అవగాహన, న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జడ్జి  మాట్లాడుతూ ప్రజలు అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు సెల్ఫోన్ వంటి వాటిని కేవలం జ్ఞానం పెంచుకోవడానికి పనులు సరళీకృతం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి తప్పితే దుర్వినియోగం చేయరాదని తెలిపారు.

 పూర్వకాలంలో గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టే అవసరం ఉండేదని కానీ నేడు ఒక క్లిక్ ద్వారా సెల్ ఫోన్ ద్వారానే అన్ని బిల్లులు పే చేసే సౌకర్యం కలిగిందని ఇటువంటి సౌకర్యకరమైన పనులకు కాలము వృధా కాకుండా ఉండే పనులకు సెల్ఫోన్ ఉపయోగించాలి తప్ప అనవసరమైన విషయాలకు సెల్ ఫోన్ ఉపయోగించి రాదని సైబర్ క్రైమ్ ల బారిన పడవద్దని ప్రజలను హెచ్చరించారు. ప్రజలపై మంచి కంటే చెడు ప్రభావం అధికంగా ఉంటుందని చెడ్డ విషయాలు అత్యంత ప్రభావితం చేస్తాయని కానీ మనిషి స్వీయ నిర్దేశిత క్రమశిక్షణ అలవర్చుకొని మంచిని మాత్రమే స్వీకరించాలలన్నారు. చెడు ప్రభావాలకు లొంగరాదని యువత స్వీయ నిర్దేశిత క్రమశిక్షణ అలవర్చుకొని చెడు ప్రభావాలకు లొంగకుండా కేవలం చదువు పైనే దృష్టి సారించాలన్నారు.

 ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఆ లక్ష్యం సాధించే దిశగా అహర్నిశలు శ్రమించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. తద్వారా ఆర్థిక స్వావలంబన కలిగి తమ ఊరికి మంచి పేరు తేవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసినాయుడు, పాలకొండ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ విజయ రాజ్ కుమార్, ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ బి నవ్య, పాలకొండ డిఎస్పీ కేవీ కృష్ణారావు, పాలకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ సత్యనారాయణ, సీతంపేట డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కె విజయభారతి, తాసిల్దారు ఎంపీడీవో సీతంపేట మరియు ఇతర అధికారులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
సిఫార్సు