ఆ కాంట్రాక్టు లెక్చిరర్లను తిరిగి చేర్చుకోవాలి..


Ens Balu
2
Srikakulam
2020-09-24 12:14:30

 శ్రీకాకుళం జిల్లాలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు లో గత ఏడాది 2019/2020 విద్యాసంవత్సరంలో కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాలలో 20 మంది అధ్యాపకులు జీవితాలు రోడ్డున పడ్డాయి. గత సంవత్సరంలో ఈ అధ్యాపకులు ఒప్పంద అధ్యాపకుల వలె విద్యార్థులకు  పాఠాలను బోధించారు. రాత్రి 24 గంటలు  కళాశాలలో ఉండి విద్యార్థులకు అదనపు తరగతులు బోధించారు. ప్రాక్టికల్స్ నిర్వహించడం , విద్యార్థులకు పరీక్షలు పెట్టి వారి యొక్క మేధస్సును పెంచడం, ప్రభుత్వం ప్రధాన పరీక్షల్లో పరిశీలన పర్యవేక్షించడం, విద్యార్థుల యొక్క చివరి పరీక్షల్లో మూల్యాంకనం కూడా చేశారు. అంతేకాదు ఎన్నికలు విధులు కూడా నిర్వహించారు. బడి మానేసిన విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించడం అనేక కార్యక్రమాలను నిర్వహించిన వీరిని విధుల నుంచి అర్ధాంతరంగా తొలగించారు. ఇన్ని చేసిన  వీరిని ఉద్యోగులుగా గుర్తించి తొలగించడం చాలా బాధాకరం విషయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రధాన కార్యదర్శి కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం సేవలందించిన వీరిని మళ్లీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారిని వీ.సెల్వియాకి విన్నవించామని చెప్పారు.  , తిరిగి తమ ఉద్యోగాలను ఇవ్వవలసిందిగా మిక్కిలి వినయ పూర్వకంగా  కోరుతున్నారు..