సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగించి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శంఖవరం మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహం వద్ద కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సంకల్పయాత్ర ద్వారానే నవరత్నాల పథకాలకు రూపకల్పన జరిగిందని, వాటిని ప్రజలకు అందించి జనరజక పాలన అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వత రాజబాబు, మండల వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.