శంఖవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎంపీపీస్కూల్ లో చిన్నారులు చేసిన ఫ్యాన్సీ డ్రెస్ విశేషంగా ఆకట్టు కుంది. అన్నవరం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాఠశాలల చిన్నారులతో గ్రామ సచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్. శిరీష సాంప్రదాయ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఎస్సీకాలనీ ఎంపీపీ స్కూలులో నిర్వహించిన ఈ షోలో చిన్నారులు సాంప్రదాయ దుస్తులతో తళుక్కుమన్నా రు. సుమారు 30 మందికి పైగా చిన్నారులు గ్రామీణ వాతావరణాన్ని తెలియజేసే దుస్తులు ధరించి పాల్గొన్నా రు. గ్రామాల్లో సోది చెప్పే సోదమ్మ చీరకట్టు, సాంప్రదాయ లుంగీ లాల్చి, ఆర్మీ దుస్తులు వేసుకు న్న విద్యార్ధు లు ఈషోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారే ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో దక్కించుకున్నారు. కార్యక్ర మంలో హెచ్ఎం బాలభాస్కర్, జి.నూకరాజు, పి.రవిబాబు, ఎస్.దేముళ్లు,జి.స్వరాజ్యలక్ష్మి, విద్యార్ధినీ, విద్యార్ధు లు పాల్గొన్నారు.