సంక్రాంతి పండుగ యొక్క గొప్పతనాన్ని చిన్నపిల్లలకు పాఠశాల స్థాయిలో తెలియజేయాలనే సంకల్పంతో అన్నవరం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంప్రదాయ సంక్రాంతి సంబురాలు కార్యక్రమం ఎంతో చక్కగా ఉందని శంఖవరం మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ నరాల శ్రీనివాసరావు అన్నారు. సోమవా రం శంఖ వరం మండలంలోని నెల్లిపూడిలోని ఎస్సీపేట ఎంపీపీ స్కూలు, ఎంపీపీ స్కూలు నెల్లిపూడిలో నిర్వహించిన సాంప్రదాయ సంక్రాంతి సంబురాల కార్యక్రమంలో పాఠశాల విద్యార్ధినీ, విద్యార్ధులు వివిధ రకాల దుస్తులతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల్లిపూడి గ్రామానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్నట్టుగా ఈకార్యక్రమంలో చిన్నాలు పాల్గొని సందడి చేశారు. గ్రామసచివాలయ మహిళా పోలీసు కళాంజలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు దేవి, ఉపాధ్యాయులు సాయిబాబ అధిక సంఖ్యలో పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.