తిరువీధుల్లో గోవిందుడి హంస వాహన దర్శనం


Ens Balu
9
Nakkapalli
2023-01-09 16:09:35

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక క్షేత్రంలో సోమవారం ఉదయం హంస వాహనంపై స్వామి వారి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. ముందుగా ఆలయంలో అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. తెల్లవారుజామున కొండపై ఉన్న స్వామివారి మూలవిరాట్ కు అర్చకులు సంకర్షణపల్లి 
రాజగోపాల కృష్ణమాచార్యులు పంచామృత అభిషేకం చేసి పుష్పాలంకరణ చేశారు. అనంతరం భక్తులను దర్శనాలకు అను మతించారు. కింద ఆలయంలో క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామికి ఆలయ ప్రధానార్చకులుగొట్టుముక్కల వర ప్రసాదాచార్యులు,పీసపాటి వెంకట శేషాచార్యులు,భాగవతం గోపాల 
ఆచార్యులు,నల్లాన్ చక్రవర్తులు శ్రీనివాసాచార్యులు నిత్య పూజలు, హోమాలు చేసి ధూప దీప నైవేద్య, నిరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.

  హంస వాహనంపై అలివేలు మంగా,పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను చిన్న పల్లకిపై గోదాదేవి అమ్మవారి ఉత్సవ మూర్తిని అలంక రించి తిరువీధి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం గోదాదేవి అమ్మవారి సన్నిధిలో తిరుప్పావై లోని ఒరుత్తు మగనాయ్ పిరన్దు ఓరిరవిల్ 25వ పాశుర విన్నపం చేశారు. అనేక మంది భక్తులు స్వామి వారిని దర్శించు కున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇందులో ఆలయ సిబ్బంది సందీప్,గురవయ్య,రమణ, గ్రామానికి చెందిన నండూరి వెంకట గోపాలాఆచార్యులు రేజేటి సింగరా చార్యులు,సిద్దాబత్తుల కృష్ణ పలు గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

సిఫార్సు