జి-20 సదస్సుకు కాంట్రాక్టర్లు సహకారం అందించాలి


Ens Balu
10
Visakhapatnam
2023-01-10 09:34:32

విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే  జి-20 సదస్సుకు జీవీఎంసీ కాంట్రాక్టర్లు సహకారం అవసరమని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. మంగళవారం ఆమె విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్ట్ అసోసియేషన్ కార్యాలయంలో వారి డైరీ ని డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, వైయస్సార్సీపి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు తో కలిసి ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి కాంట్రాక్టర్ల సహకారం ఎంతో అవసరమని,  మార్చి నెలలో నిర్వహించే జి - 20 సదస్సుకు దాదాపు 40 దేశాల నుండి ప్రతినిధులు వస్తారని వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నగర సుందరీకరణలో కాంట్రాక్టర్లు భాగస్వాములై పనులు పూర్తి చేయాలన్నారు. కాంట్రాక్టర్లు పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడే చెల్లిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఎస్సీ స్లాబ్ బిల్లులు రూ. 38 కోట్లు, జీవీఎంసీ సాధారణ పద్ధతి కింద రూ. 299 కోట్లు, టిఎస్పీ  గ్రాంట్లు రెండు కోట్లు, ఈ ఎండిలు రూ.20 కోట్లు చెల్లినట్టు పేర్కొన్నారు. 

కాంట్రాక్టర్లు వారి సమస్యలు పరిష్కరించేందుకు, పనుల యొక్క గ్రాంట్లు చెల్లించే విధంగా కౌన్సిల్లో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి  నివేదించి వారికి చెల్లింపులు చేస్తామన్నారు. కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వీరారెడ్డి మాట్లాడుతూ, విశాఖ నగరాభివృద్ధికి ఎల్లప్పుడూ మా కాంట్రాక్టర్ అసోసియేషన్ తరపున సహకారం ఉంటుందని, పనుల యొక్క బకాయిలు త్వరితకటిన అందించేందుకు నగర మేయర్, కమిషనర్, పాలకమండలి ఎంతో కృషి చేస్తున్నారని అందుకు కాంట్రాక్ట్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఆర్ సాదురావు, కన్వీనర్ చంద్రమౌళి, జాయింట్ సెక్రటరీ రమేష్, వైస్ ప్రెసిడెంట్ చినఅప్పారావు, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
సిఫార్సు