పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతీ ఫిర్యాదు దారుడికీ రసీదు ఇవ్వాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాద్ బాబు సూచించారు. మంగళవారం ఆయన తొండంగిలోని పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా స్టేషన్ లోని రికార్డులు, స్టేషన్ వాతావరణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసులు ప్రజల పట్ల జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. సమస్య, కష్టం అని వచ్చిన వారికి స్వాంతన కలిగేలా సేవలు అందించాలన్నారు. చోరీలను తక్షణ రికవరీ చేయాలన్నారు. ఎస్పీ వెంట డిఎస్పీలు అంబికా ప్రసాద్, వెంకటేశ్వర్రావు, సిఐ సన్యాసిరావు, తొండంగి స్టేషన్ ఎస్ఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.