ఎస్సీ కార్పొరేషన్ పథకాలను తక్షణమే అమలు చేయాలి


Ens Balu
20
Visakhapatnam
2023-01-10 11:34:19

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ను పూర్తిగా విస్మరించిందని, గత మూడేళ్లుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క పథకం కూడా అమలు చేయలేదని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జెవి ప్రభాకర్ అన్నారు. దళితుల బతుకు తెరువు కోసం అమలు చేయాల్సిన టాక్సీ, ఆటో కేటాయింపు స్కీం లను నిలిపవేసారని ఆవేదన వ్యక్తం చేస్తూ... మంగళవారం ఎల్ఐసి కూడలి లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ నిధులు నవరత్నాలకు దారి మళ్ళించడం ఆపాలని, ఎస్సీ కార్పొరేషన్ లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా కోటాయించిన నిధులు ఇతర పనులకు మళ్ళించడం చట్ట విరుద్ధం అన్నారు. హైకోర్టు 2003లోనే తీర్పు ఇచ్చింది సుమారు 7వేల కోట్లు నిధులు నవరత్నాలకు మళ్లించడం అన్యాయమన్నారు.
 జగన్ ప్రభుత్వం అధికరంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్లను మాల, మాదిగ, రెల్లి కార్పొ రేషన్లుగా విభజించి  మూడున్నర సంవత్సరాలైనా  ఒకరూపాయి  కేటాయించలేదన్నారు.

 ఎస్సీ కార్పొరేషన్  ద్వారా, భూమి కొనుగోలు పథకం, రోడ్లు, ముఖ్యంగా స్వయం ఉపాధి పథకాలు కోసం ఖర్చు పెట్టకుండా ఇతర అవసరాలక ప్రభుత్వం ఖర్చు పెట్టడం దళితులను ద్రోహం చేయడమే అవుతుందన్నారు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు బొడ్డు కళ్యాణ్ రావు మాట్లాడుతూ, దళితుల ఆర్థిక పురోగతికి దోహదపడే పథకాలన్నీ నిలిపివేశాలన్నారు. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి అన్నారు. విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షలకు కోసం లక్షలాది రూపాయలు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు సమర్పించుకుం టున్నారన్నారు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో డిహెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు, కార్యదర్శి జి రాంబాబు, ఉపాధ్యక్షులు ఎం సత్యనారాయణ వివిధ సంఘాల నాయకులు ఓంకార్, అంబేద్కర్, రాజనరమని, బి అప్పారావు ,ఐ గురుమూర్తి ,కోటేశ్వరరావు, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు