ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చేపట్టిన భూ సర్వే నాణ్యత, ఖచ్చితంగా ఉండాలని అధికారులను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. పూసపాటిరేగ మండలం భరణికం గ్రామంలో జిల్లా కలెక్టర్ మంగళవారం పర్యటించారు. భరణికంలో జరుగుతున్న రీ సర్వే ను పరిశీలించారు. అక్కడకు విచ్చేసిన రైతులతో మాట్లాడారు. రైతులు రీ సర్వే కు సహరించినప్పుడే వేగంగా సర్వే ప్రక్రియ పూర్తి అవుతుందని అన్నారు. రైతులు హాజరై సరిహద్దులను, కొలతలు సరి చూసుకోవాలని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్షించారు. ఓటర్ల జాబితాకు ఆధార్ సీడింగ్ వేగంగాచేయాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశించారు. అనంతరం సచివాలయ సిబ్బందితో పలు పథకాల అమలు, హౌసింగ్, పారిశుధ్య కార్యక్రమాలు తదితర అంశాల పై సమీక్షించారు. స్పందన వినతులు పరిష్కారం క్వాలిటీ గాను, వేగంగా జరగాలన్నారు. పలు రికార్డ్ లను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ భాస్కర రావు పాల్గొన్నారు.