ఇక గ్రామ స్థాయిలోనే ప్రభుత్వ ప్రాధమిక వైద్యం


Ens Balu
14
దేవరాపల్లి
2023-01-10 12:50:46

గ్రామస్థాయిలోనే ప్రాధమిక వైద్యం అందించేందుకు వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నదని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. మంగళవారం దేవరాపల్లిలో రూ.17.50 లక్షలు తో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మారేపల్లి గ్రామ సచివాలయ పరిధిలో  గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ మత్స్య శాఖ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకంలో బాగంగా మరేపల్లి గ్రామంలో 17 మందికి మోటార్ సైకిళ్ళను మాడుగుల, చీడికాడ, దేవారపల్లి, కోటపాడు మండలాల లబ్ధిదారులకు  పంపిణీ చేశారు. గ్రామ ప్రజల నీటి అవసరాల కోసం రూ.49 లక్షలతో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 40 లక్షల రూపాయలతో నిర్మించిన లక్షలు గ్రామ సచివాలయం భవనాన్ని,  అనంతరం 3లక్షల చేప పిల్లలను రైవాడ  జలాశయం లో విడుదల చేశారు. ఈ కార్యక్రమం మండల ఎంపిపి రాజేశ్వరీ భాస్కర రావు, ఎంపీడీఓ పార్టీ అధ్యక్షులు బాబు రావు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
సిఫార్సు