శ్రీకాకుళంజిల్లాలో రైతుల నుండి సేకరిస్తున్న ధాన్యాన్ని మిల్లుల వద్ద అన్ లోడ్ చేయడంలో గాని, ఎఫ్.సి.ఐకి బియ్యం పంపించడంలో జాప్యం గాని జరగరాదని సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో భాగంగా జిల్లాలోని పలు రైస్ మిల్లులను జెసి ఆకస్మిక తనిఖీలో భాగంగా నరసన్నపేటలోని వెంకట నాగేశ్వర రైస్ మిల్ , వెంకట లక్ష్మి జగ్గన్న రైస్ మిల్లులను జెసి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో ఎఫ్.సి.ఐకి బియ్యం పంపించడంలో జాప్యం జరగడంపై విచారించి పలు సూచనలు చేశారు. అనంతరం శ్రీకాకుళం రూరల్ మండలం శిలగాం సింగువలస ఎఫ్.సి.ఐ గోదాముకు వెళ్ళి మిల్లుల నుండి వచ్చిన ధాన్యం లోడులను పరిశీలించి త్వరగా అన్ లోడ్ చేయాలని, అన్ లోడ్ చేయడంలో జాప్యం జరగరాదని ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా సరఫరాల అధికారి డి.వెంకట రమణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.