నేటి యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద అని కాకినాడ సబ్ డివిజన్ డిఎస్పి పడాల మురళీకృష్ణారెడ్డి అ న్నారు. బుధవారం కాకినాడ విద్యుత్ నగర్ ఐడియల్ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించా రు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, యువత వివేకానంద ఆశయ సాధనకు ముందడుగువేయాలన్నా రు. కాకినాడ బీచ్ మార్తాన్ రన్, సంస్కృతి కార్యక్రమాలలో పాల్గొన్న విజేతలను జ్ఞాపకలతో మెడల్స్ వేసి సత్కరిం చారు. డైరెక్టర్ కె.వాసు మాట్లాడుతూ, కళాశాల కరస్పాండెంట్ చిరంజీవి కుమారి కృషితో తమ విద్యార్ధులు చదువుతోపాటు ఆటల్లోనూ ముందుంటున్నారన్నారు. అనంతరం డిఎస్పి పడాల మురళీకృష్ణా రెడ్డిని దుస్సా ల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐడియల్ కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.