సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విజయనగరం1వ పట్టణ పోలీసు పరిధిలో ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళితే తమకు సమాచారం అందించాలని సిఐ బి.వెంకటరావు ప్రజలను కోరారు. ఇల్లు విడిచి బయట ప్రాంతాలకు వెళ్ళినపుడు ముందుగా సమాచారాన్ని అందిస్తే, సదరు ఇండ్లపై నిఘా పెడతామని తెలియ జేశారు. ఈమేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ మైక్ ప్రచారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విలువైన వస్తువులు ఏమీ ఇంట్లో ఉంచవద్దని, LHMS సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి, ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో రక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.